ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ప్రభాకర్ రావు

June 11, 2025


img

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు నేడు మరోసారి సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఆయనపై కేసు నమోదు కాగానే అమెరికా వెళ్ళిపోయి ఎన్ని నోటీసులు ఇచ్చినా తిరిగి రాకుండా అక్కడే 15 నెలల పాటు ఉండిపోయారు. ఆయనని అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు తెలంగాణ పోలీసులను ఆదేశించిన తర్వాత ఈ నెల 8 న హైదరాబాద్‌ తిరిగి వచ్చి విచారణకు హాజరయ్యారు. 

విచారణకు సహకరించాలనే షరతుపైనే సుప్రీంకోర్టు ఆయనని అరెస్ట్‌ చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. కనుక నేడు మరోసారి ప్రశ్నించేందుకు విచారణకు హాజరవ్వాలని సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడంతో వస్తున్నారు. ప్రభాకర్ రావు హైదరాబాద్‌ తిరిగి వచ్చి విచారణకు హాజరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబందించి కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తే, ఆయన విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. 

ఒకవేళ ఆయన నోరు విప్పితే ఈ కేసు మాజీ సిఎం కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం ఖాయం. ఓ పక్క ఆయన ఈరోజు జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్‌ ఎదుట విచారణకు హాజరావుతుంటే, మరోపక్క ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా కొలిక్కి వస్తుండటంతో బిఆర్ఎస్ పార్టీని ఆందోళన గురి చేస్తుండవచ్చు. 


Related Post