హరీష్ రావు స్థానంలో కల్వకుంట్ల కవిత: సామ ట్వీట్

April 24, 2025

img

తెలంగాణ పీసీసీ మీడియా కమిటీ అధ్యక్షుడు సామ రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై బిఆర్ఎస్ పార్టీ భగ్గుమంటోంది. బిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావు స్థానాన్ని కల్వకుంట్ల కవిత ఆక్రమించబోతున్నారని, వరంగల్‌ బిఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాట్లలో ఆమె చేస్తున్న హడావుడి చూస్తే గోలాబీ బాస్ హరీష్ రావుని మెల్లగా పక్కన పెడుతున్నట్లనిపిస్తోందన్నారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

బిఆర్ఎస్ లో మారుతున్న రాజకీయ పరిణామాలు..
@BRSHarish స్థానంలో @RaoKavitha ?

నేడు వరంగల్ సభ ఏర్పాట్లలో కవిత ఫుల్ ఆక్టివ్. హరీష్ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్ ?
నేడు సభకి.. భవిష్యత్తులో @BRSparty కి ..ఇక హరీష్ దూరమేనా?
అనూహ్య మలుపులు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్.… pic.twitter.com/yC1wGvPlRY
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) April 24, 2025

దీనిపై బిఆర్ఎస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. “సబ్జెక్ట్ లేక ఇలాంటి చిల్లర పోస్టులతో రాజకీయాలు చేస్తున్నావు. మీరు ప్రజల గురించి ఆలోచించాలి కానీ మా పార్టీ గురించి కాదు కదా? ఈ సభ కోసం వేసిన అన్ని కమిటీలు హరీష్ రావు నేతృత్వంలోనే పనిచేస్తున్నాయి. హరీష్ రావు సూచనల మేరకే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 15-20 రోజులలో ఆయన అక్కడికి మూడుసార్లు వెళ్ళి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జవాబు ఇచ్చింది.

Related Post