ఆదిలాబాద్‌లో దారుణం.. నీళ్ళ ట్యాంకులో విషం!

April 16, 2025


img

ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై సామూహిక హత్య ప్రయత్నం జరిగింది. విద్యార్ధులు త్రాగే మంచి నీళ్ళ ట్యాంకులో గుర్తు తెలియని దుండగులు ఎవరో పురుగుల మందు కలిపారు. మద్యాహ్నం భోజనం వండే పాత్రలలో కూడా పురుగుల మందు జల్లినట్లు సిబ్బంది గుర్తించి వెంటనే పాఠశాల హెడ్ మాస్టర్ ప్రతిభకు ఫిర్యాదు చేశారు. ఆమె వెంటనే ఉపాధ్యాయులతో కలిసి విద్యార్ధులు ఎవరూ ఆ నీళ్ళు తాగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.   

ఆ పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్ధులు చదువుతున్నారు. కానీ అదృష్టవశాత్తు శని ఆదివారం సెలవులు కావడంతో విద్యార్ధులు లేరు. శుక్రవారం మద్యాహ్నం విద్యార్ధుల భోజనాలు ముగియగానే వంట పాత్రలన్నీ పాఠశాల వంట గదిలో పెట్టి గదికి తాళం వేశామని, కానీ సోమవారం ఉదయం వాటిని బయటకు తీసి కడగబోతే ఏదో దుర్వాసన వస్తుండటంతో అనుమానం కలిగి చూడాగ గదిలో ఓ మూల పురుగుల మందు డబ్బా కనిపించిందని సిబ్బంది చెప్పారు. 

స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే పోలీసులకు, పై అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు సకాలంలో అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. 


Related Post