శనివారం చెన్నైలో ఫెయిర్ డీలిమిటేషన్ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం అందరినీ చాలా ఆలోచింపజేసింది. డీలిమిటేషన్ అంటే పార్లమెంటులో సీట్లు, వాటాలు మాత్రమే కాదు. మళ్ళీ ఓ నియంతృత్వ వ్యవస్థని ప్రాణం పోసినట్లే!
కేంద్రంలో మందబలం ఎక్కువగా ఉన్నందునే తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 ఏళ్ళ పాటు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. అదే సమాన ప్రాతినిధ్యం ఉండి ఉంటే నిధులలో అన్ని రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కేది.
ఇప్పుడున్న బలాబలాలతోనే దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. ఈ డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత ఇంకా తగ్గితే ఈ వివక్ష ఇంకా పెరుగుతుంది. కనుక అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ ప్రతిపాదనని అడ్డుకోవాలి,” అని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..
చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
— BRS News (@BRSParty_News) March 22, 2025
♦️డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని అద్భుతంగా తెలియ చెప్పిన కేటీఆర్
♦️ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు
♦️నిధులు… pic.twitter.com/xOJwnaAzP2