చెన్నైలో దొంగల ముఠా సమావేశం: బండి సంజయ్‌

March 22, 2025


img

ఈరోజు చెన్నైలో ‘ఫెయిర్ డీలిమిటేషన్‌’ పేరుతో జరిగిన సమావేశంపై తెలంగాణ బీజేపి ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “చెన్నైలో జరిగింది బందిపోటు దొంగల ముఠా సమావేశం. తమిళనాడులో రూ.1,000 కోట్ల మద్యం కుంభకోణంలో డీఎంకే నేతలు నిందితులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నవారందరూ ఏదో ఓ అవినీతికి పాల్పడినవారే. అందుకే అదో దొంగలముఠా సమావేశం అనాల్సివస్తోంది. 

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని, ఆ రెండూ పరస్పరం సహకరించుకుంటున్నాయని మేము ఎప్పటి నుంచో చెపుతున్నాము. బిఆర్ఎస్ పార్టీ హయంలో జరిగిన అవినీతి, అవకతవకాలపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు, విచారణ అంటూ కాలక్షేపం చేస్తోందే తప్ప ఇంతవరకు కేసీఆర్‌కి ఒక్క నోటీస్ ఇచ్చిందా?

రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే ఒక పార్టీని మరొకటి కాపాడుకుంటున్నాయి.   ఆ రెండు పార్టీల నేతలు ఇక్కడ కత్తులు దూసుకుంటూ, అక్కడకి కలిసి వెళ్ళడమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప ప్రజలకు ఏం చేశాయి? రెండు పార్టీలు కనీసం రాష్ట్రంలో రైతులను ఆదుకోలేకపోయాయి,” అని విమర్శించారు. 

డీలిమిటేషన్‌ గురించి మాట్లాడుతూ, “అసలు ఈ ప్రక్రియ ఇంకా మొదలవలేదు. డీలిమిటేషన్‌కి ఎటువంటి నియమ నిబంధనలు పెట్టలేదని, దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గించబోమని అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ చెపుతూనే ఉన్నారు. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం, ఇక్కడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ వైఫ్యల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టాయి,” అని బండి సంజయ్‌ అన్నారు.  


Related Post