సోమవారం ఉదయం సచివాలయం ఆవరణలో అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి.
“తెలంగాణ తల్లి అంటే మన అమ్మలా ఉండాలి. అస్తిత్వం కోసం జరిగిన మన పోరాటాలను గుర్తుచేస్తూ ప్రతీకగా ఉండాలి. బహుజనులు పిడికిలి బిగించి పోరాడుతూ చేసిన త్యాగాలను గుర్తు చేసేలా ఉండాలి.
మన పల్లెటూర్లలో ఉండే అటువంటి స్త్రీమూర్తులకు ప్రతిరూపం ఈ తెలంగాణ తల్లి విగ్రహం. తల్లిని చూసినప్పుడు తల్లనే భావన కలగాలి. తెలంగాణ తల్లిని చూసినప్పుడు నాకు మా చిన్నప్పుడు మా అమ్మని చూసిననట్లు అనిపిస్తుంది.
గత పాలకులు తెలంగాణ తల్లి విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా, తెలంగాణ పోరాటాలను పట్టించుకోకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
కోట్లాదిమంది ప్రజల పోరాటాలు, అనేక మంది యువకుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఓ కుటుంబ త్యాగాలుగా చెప్పుకుంటున్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్నా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర గీతాన్ని రూపొందించలేదు.
ఇకపై ఏటా తెలంగాణ తల్లి దినోత్సవం ఘనంగా జరిపిస్తాము. భవిష్యత్‌లో తెలంగాణ తల్లి విగ్రహం మార్చనీయకుండా చట్ట పరమైన నిబంధనలు, చర్యలు చేపడతాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నా జీవిత కాల …
మధుర జ్ఞాపకం.
అవతరిస్తోన్న అమ్మకు…
అంజలి ఘటిస్తూ…
పుష్పాంజలి సమర్పిస్తూ…#TelanganaThalli #Secretariat #TelanganaRising #PrajaPalana pic.twitter.com/4LZGhvrSKZ