రేవంత్‌ రెడ్డికి కూడా వాస్తు పిచ్చి: హరీష్ రావు

November 07, 2024


img

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలలో సచివాలయం కూడా ఒకటి సుమారు రూ.600-700 కోట్లు వ్యయంతో దీనిని అద్భుతంగా నిర్మించారు. కేసీఆర్‌కి వాస్తు పట్టింపు చాలా ఎక్కువ కనుకనే పాత సచివాలయానికి వాస్తు దోషం ఉందంటూ కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించారు.

దానిలో ప్రతీదీ వాస్తు ప్రకారం ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తు ప్రకారం కొత్త సచివాలయంలో నిర్మించుకున్నాకనే కేసీఆర్‌ దానిలో అడుగుపెట్టారు. అంత వాస్తు పట్టింపు ఉన్న కేసీఆర్‌ నిర్మించిన భవనంలో మళ్ళీ వాస్తు కోసం అంటూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సచివాలయంలో ఓ గేటుని తొలగించి ఈశాన్యం దిశలో పెట్టింస్తోంది. 

దీనిపై హరీష్ రావు ఘాటుగా స్పందిస్తూ, “ఆనాడు కేసీఆర్‌కి వాస్తు పిచ్చి అంటూ నోటికివచ్చిన్నట్లు మాట్లాడినా రేవంత్‌ రెడ్డే ఇప్పుడు వాస్తు కోసం రూ.4 కోట్లు ప్రజాధనం ఖర్చుచేసి గేటు మార్పిస్తున్నారు.

కొత్త సచివాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ సిగ్నల్‌ టెక్నాలజీ, అగ్నిమాపక రక్షణ వ్యవస్థతో నిర్మించాము. తెలంగాణ సచివాలయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అటువంటి సచివాలయంలో వాస్తు కోసం అంటూ రేవంత్‌ రెడ్డి గేటు మారుస్తుండటం చాలా హాస్యస్పదంగా ఉంది,” అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

 

Related Post