ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఘోరప్రమాదం...ఐదుగురు మృతి

March 28, 2020
img

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ 30 మందితో కూడిన ఓ బొలేరో వాహనం ఔటర్‌రింగ్‌ రోడ్డులో ప్రయాణించ గలగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దానిని వెనుక నుంచి వచ్చిన ఓ లారీ డ్డీకొనడంతో దానిలో ప్రయాణిస్తున్నవారిలో ఐదుగురు ఘటనాస్థలంలోనే మృతి చెందగా మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంలో బొలేరో డ్రైవరుతో సహా ఓ పసిపాప, ఒక బాలిక కూడా చనిపోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఐదుగురి మృతదేహాలనుపోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం కర్ణాటకలో రాయదుర్గంకు చెందిన వారందరూ హైదరాబాద్‌లో వలస కూలీలుగా పనిచేస్తుండేవారు. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పని, ఆదాయం లేక వారందరూ వ్యాను మాట్లాడుకొని శుక్రవారం రాత్రి రాయదుర్గం బయలుదేరారు. వారి వాహనం ఔటర్‌రింగ్‌ రోడ్డుపై శంషాబాద్ సమీపంలో గల పెద్ద గోల్కొండ వద్దకు చేరుకొన్నపుడు వెనుకనుంచి వచ్చిన ఓ లారీ బలంగా డ్డీకొంది. ప్రమాదం జరిగినవెంటనే లారీ డ్రైవరు లారీని వదిలి పారిపోయాడు. పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని అతనికోసం గాలిస్తున్నారు.

Related Post