జూన్ 9 నుంచి హైదరాబాద్‌లో చేపమందు పంపిణీ

May 23, 2023
img

హైదరాబాద్‌లో ఏటా మృగశిర కార్తే సమయంలో బత్తిన సోదరులు ఆస్త్మా రోగులకు ఉచితంగా చేపమందు పంపిణీ చేస్తుంటారు. కరోనా కారణంగా గత మూడేళ్ళుగా చేపమందు పంపిణీ నిలిచిపోయింది. జూన్ 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్‌, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాకు తెలియజేశారు. బత్తిన సోదరులు ఈరోజు ఉదయం సచివాలయానికి వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సమావేశమై చేపమందు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దానిపై సానుకూలంగా స్పందించిన అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం ఈ నెల 25 నుంచే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు మొదలుపెట్టి అవసరమైన చేప పిల్లలను సిద్దంగా ఉంచుతామని చెప్పారు. 

బత్తిన వంశస్థులు గత మూడు తరాలుగా ఆస్తమా రోగులకు ఉచితంగా చేపమందు తయారుచేసి అందిస్తున్నారు. దాని కోసం దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలమంది రోగులు వస్తుంటారు. కనుక రాష్ట్ర ప్రభుత్వమే దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

Related Post