రేపటి నుంచే హైదరాబాద్‌లో చేపమందు పంపిణీ

June 08, 2023
img

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం ఉదయం 8 గంటల నుంచి ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు చేపమందు పంపిణీ చేయబోతున్నారు. ఏటా మృగశిర కార్తే సమయంలో బత్తిన సోదరులు ఆస్త్మా రోగులకు చేప మందు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా గత మూడేళ్ళుగా చేపమందు పంపిణీ నిలిచిపోయింది. చేపమందు కోసం దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆస్తమా రోగులు వస్తుంటారు. రోజుకి సుమారు లక్ష మందికి పైగా చేపమందు పంపిణీ చేస్తుంటారు కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు చేపమందు పంపిణీ చేస్తారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఆర్టీసీ, విద్యుత్‌, వైద్య తదితర శాఖల సిబ్బంది సమన్వయం చేసుకొంటూ ఈ కార్యక్రమాని సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.     


Related Post