తెలంగాణ వైద్య మరియు ఆరోగ్యశాఖ రాష్ట్రంలో వివిద ప్రభుత్వాసుపత్రులలో స్పెషలిస్ట్ డాక్టర్స్ భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో 1616 మంది, ఆర్టీసీ ఆస్పత్రులలో 7 మంది వైద్య నిపుణుల భర్తీ చేయబోతోంది.
సరైన అర్హత, అనుభవం ఉన్న వైద్యులు సెప్టెంబర్ 8 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే సుమారు 8,000 పోస్టులు భర్తీ చేసింది. రాబోయే రోజుల్లో మరో 7,000 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు.