ఏపీ ప్రభుత్వ పాఠాశాలలో కొత్త ప్రయోగం: నో బ్యాగ్ డే!

July 26, 2025
img

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠాశాలలో ఓ సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠాశాలలో ప్రతీ శనివారం ‘నో బ్యాగ్ డే’ విధానం అమలుచేస్తున్నారు. ఆ రోజు పిల్లలు బ్యాగులు, పుస్తకాలు లేకుండా పాఠాశాలకు వచ్చి రోజంతా ఆటపాటలతో హాయిగా గడుపుతారన్న మాట. 

ప్రతీ శనివారం ‘నో బ్యాగ్ డే’ రోజున ఉపాధ్యాయులు విద్యార్ధులలో దాగి ఉన్న ప్రతిభని బయటకు తీసేందుకు తోడ్పడతారు. వివిధ క్రీడలలో పాల్గొనడం, బొమ్మలు గీయడం, నాటకాలు వేయడం, సంగీతం, పాటలు, డాన్స్ వంటివి విద్యార్ధుల అభిరుచికి తగ్గ పనులు చేస్తారు. వారికి ఉపాధ్యాయులు అన్ని విధాలా తోడ్పడుతూ ప్రోత్సహిస్తారు. 

ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ చదువుల ఒత్తిడి లేకుండా రోజంతా సరదాగా కలిసి మెలిసి గడపడం వలన వారి మద్య చక్కటి అనుబందం పెరుగుతుంది. విద్యార్ధి దశలోనే వారిలో ప్రతిభని గుర్తించి, వెలికి తీసి దానిలో వారు రాణించేందుకు ఉపాధ్యాయులు తోడ్పడుతారు కనుక భవిష్యత్తులో విద్యార్ధులు ఆయా రంగాలలో రాణించగలుగుతారు కూడా. కనుక ఖచ్చితంగా ఇది చాలా చక్కటి ఆలోచనే అని చెప్పవచ్చు. 


Related Post