వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు

September 10, 2025


img

ప్రముఖ నటుడు వరుణ్ తేజ్ తండ్రి అయ్యారు. ఆయన భార్య లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం హైదరాబాద్‌ రెయిన్ బో హాస్పిటల్లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, అభిమానులు వారికి అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి హాస్పిటల్‌కు వెళ్ళి వారికి అభినందనలు తెలిపారు. 

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారిగా మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి ప్రేమించుకున్న వారు ఇరు కుటుంబాల పెద్దల ఆమోదంతో 2023లో ఇటలీలోని టస్కానీ నగరంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. లావణ్య త్రిపాఠి గర్భం దాల్చిన తర్వాత ఇద్దరూ సినిమాలు తగ్గించుకొని హాయిగా దేశవిదేశాలలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఆమెకి ఇప్పుడు పిల్లాడి బాధ్యతలు ఉన్నందున కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండవచ్చు. 

కానీ వరుణ్ తేజ్ ఇప్పటికే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ హర్రర్-కామెడీ సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు. కనుక త్వరలో అది మొదలుపెడతారు. వీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై నిర్మించబోతున్న ఈ సినిమాకి ధమన్‌ సంగీతం అందించబోతున్నారు. 


Related Post