తెలంగాణ పోలీస్ విభాగంలో 118 పోస్టులకు నోటిఫికేషన్ జారీ

August 16, 2025
img

తెలంగాణ పోలీస్ విభాగంలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం మల్టీజోన్-1లో 38 పోస్టులు, మల్టీజోన్-2లో 57 పోస్టులను నేరుగా భర్తీ (డైరెక్ట్ రిక్రూట్మెంట్) చేస్తారు. మల్టీజోన్-2లో మరో 11 పోస్టులను మాత్రం లిమిటెడ్ రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత, వయో పరిమితి, స్థానికత, రిజర్వేషన్స్ వగైరా పూర్తి సమాచారం కొరకు www.tgprb.in వెబ్‌సైట్‌ చూడవచ్చు. దాని ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని టిజీపీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. 

Related Post