తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త. వారి పదోన్నతులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసారి మొత్తం 3,500 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభిస్తాయి.
ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న 630 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్స్‌గా పదోన్నతి లభిస్తుంది. అదేవిదంగా ఎస్‌జీటీలుగా చేస్తున్న 600 మందిని హెచ్ఎంలుగా పదోన్నతి లభిస్తుంది. సుమారు 800 మంది పీఈటీ, భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించనుంది. 900 మంది సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా పదోన్నతి లభిస్తుంది.
ఇప్పటికీ ఈ పదోన్నతుల ఫైల్‌పై సిఎం రేవంత్ రెడ్డి సంతకం చేసినందున వచ్చే వారంలో పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ వెలువడనుంది.