తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో ప్రవేశాల కొరకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసస్ తెలంగాణ (దోస్త్) నేటి నుంచి ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. దీని కోసం విద్యార్ధులు ఈ నెల 21 నుంచి 31 వరకు రూ.400 రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.
ఈ నెల 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్, చివరి రోజున ధ్రువ పత్రాల పరిశీలన చేస్తారు. వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఆగస్ట్ 3వ తేదీన విద్యార్ధులకు ఎంచుకున్న లేదా అందుబాటులో ఉన్న కాలేజీలలో సీట్లు కేటాయిస్తారు. ఆగస్ట్ 6వ తేదీన విద్యార్ధులు కాలేజీలలో రిపోర్టింగ్ చేయాలి.
ఒకవేళ ఈ రౌండ్ కౌన్సలింగ్ తర్వాత ఇంకా సీట్లు మిగిలిపోతే ఆగస్ట్ 11,12 తేదీలలో ఖాళీలను బట్టి ఆయా కాలేజీలలోనే స్పాట్ అడ్మిషన్స్ పొందవచ్చు. నాన్ లోకల్ విద్యార్ధులు కూడా అడ్మిషన్స్ పొందవచ్చు. అయితే ఈ విదంగా స్పాట్ అడ్మిషన్స్ ద్వారా చేరిన విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ పొందేందుకు అనర్హులుగా పరిగణించబడతారు.