ఉపాధ్యాయులే తాగునీటిలో విషం కలిపారు!

August 23, 2025
img

పిల్లలు ఇంటి గుమ్మం దాటి మొదట అడుగుపెట్టేది పాఠాశాలలోనే. కనుక ఆ పిల్లలు పాఠాశాలలో ఉన్నంత వరకు వారిని కాపాడుకోవలసింది ఉపాధ్యాయులే. కానీ ఆ ఉపాధ్యాయులే పిల్లల ప్రాణాలు హరించాలనుకుంటే? జయశంకర్ భూపాలపల్లిలో ఇదే జరిగింది.

జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో బీ. వెంకన్న ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్నారు. అతనిపై కక్షగట్టిన సైన్స్ టీచర్ రాజేందర్ మరో ఇద్దరు ఉపాధ్యాయులు, వంట మనిషి కలిసి పాఠశాల నీళ్ళ ట్యాంకులో పురుగుల మందు కలిపారు.

ఆ నీళ్ళు తాగి 11 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

తాగునీటిలో సైన్స్ టీచర్ పురుగుల మందు కలిపారనే విషయం ఆస్పత్రిలో చేరిన విద్యార్ధుల ద్వారా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలుసుకున్నారు. వెంటనే వారు నలుగురినీ సస్పెండ్ చేసి, వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్పీ కిరణ్ కరేని ఆదేశించారు.

విద్యార్ధుల తల్లితండ్రులు ఈ విషయం తెలియడంతో ఆస్పత్రికి తరలివచ్చి పిల్లలను చూసి కంట నీరు పెట్టుకున్నారు. బాధ్యులని కటినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Related Post