బీసీ బిల్లు ఆమోదించేశాం.. ఇక కేంద్రానిదే బాధ్యత!

March 18, 2025


img

తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ నిన్న శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుకి ఆమోదముద్ర పడింది. దీంతో పాటు రాష్ట్రంలో వెనియకబడిన తరగతులు, షెడ్యూల్‌ కుల్లాలు, తెగలకు విద్యాసంస్థలలో సీట్లు, రాష్ట్ర సర్వీసులు-2025, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు-2025 బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

శాసనసభ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలుచేయాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కనుక దీనిని కేంద్రానికి పంపించి సహకరించాల్సిందిగా కోరుతామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీని గురించి ప్రధాని మోడీకి వెంటనే ఓ లేఖ కూడా పంపించారు. అఖిలపక్ష నాయకులతో కలిసి దీని గురించి మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్‌ ఈయవలసిందిగా ప్రధాని మోడీని ఆ లేఖలో కోరానని తెలిపారు.          

బీసీ రిజర్వేషన్ల బిల్లుకి శాసనసభ ఆమోదించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కానీ రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ బిల్లు అమలుచేయడం సాధ్యం కాదు. అన్ని వర్గాల రిజర్వేషన్లు కలిపి 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఉంది. ఒకవేళ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన్నట్లయితే మిగిలిన వర్గాలు తమకూ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేయకుండా ఉండవు. 

ఒకవేళ 50 శాతం పరిమితి దాటకుండా బీసీలకు 47 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలంటే వేరే వర్గాలకు తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడూ ఆందోళనలు తప్పవు. కనుక బీసీ రిజర్వేషన్స్ పెంపు అంటే తేనె తుట్టెని కదపడమే అని స్పష్టమవుతోంది. అందువల్లే 2017 లో కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు 37 శాతం రిజర్వేషన్స్ పెంచుతూ చేసి పంపిన బిల్లుని కేంద్రం ఇంతవరకు ఆమోదించలేదని సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగం వింటే అర్దమవుతుంది. కనుక మరో 5 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన ఈ బిల్లుని ఆమోదిస్తుందా?

అంటే కాదనే అర్దమవుతోంది. దీనిని కూడా కేంద్రం చెత్తబుట్టలో పడేయటం ఖాయమే. కాంగ్రెస్‌, బిఆర్ఎస్, మజ్లీస్ మూడు పార్టీలకు ఈవిషయం తెలియదా? తెలిసీ ఎందుకు ఇలా చేశాయంటే, బీసీ ఓటు బ్యాంక్ కోసమే. వారి సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకొని ఓట్లు రాల్చుకునేందుకే! 


Related Post