జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు: కిం కర్తవ్యం?

March 13, 2025


img

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ని ఉద్దేశించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈరోజు శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనని శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కనుక స్పీకర్‌ ఆయనని ఈ బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అవసరమైతే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి టాంక్ బండ్ వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చొని నిరసన తెలిపారు.

 జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌పై ఈరోజు సాయంత్రం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించనున్నారు. రేపు హోలీ పండుగ సందర్భంగా శాసనసభకు సెలవు. కనుక రేపు వారు ఎంత హడావుడి చేసినా ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. కనుక శనివారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యి అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్ భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మని కలిసి పిర్యాదు చేసే అవకాశం ఉంది. లేదా జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌కు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ శాసనసభ సమావేశాలను బహిష్కరించే అవకాశం కూడా ఉంది. 



Related Post