ఈ ఒక్కసారి మాత్రమే రేవంత్ సిఎం: మహేష్ కుమార్‌ గౌడ్‌

February 18, 2025


img

కాంగ్రెస్ నేతలని ఎవరూ ఎక్కువ కాలం నియంత్రించలేరని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మరోసారి నిరూపిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.  

“బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. కనుక ఏదో ఓ రోజున తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి వస్తారు. వచ్చే ఎన్నికలలో బీసీలు, బీసీ ముఖ్యమంత్రి ప్రధానాంశంగా ఉండబోతున్నాయి. ఎన్నికల తర్వాత బీసీ ముఖ్యమంత్రి వస్తారు. అంతవరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు,” అని అన్నారు.

కనుక కాంగ్రెస్‌ నేతలు ముఖ్యమంత్రి కుర్చీ కింద మంట పెట్టడం మొదలుపెట్టారని స్పష్టమవుతోంది. అమెరికాలో తుపాకీ సంస్కృతిని, కాంగ్రెస్ పార్టీలో ఒకరి కాళ్ళు మరొకరు లాక్కునే సంస్కృతిని ఎవరూ మార్చలేరు. తుపాకీ సంస్కృతికి అమెరికాలో నిత్యం ఏవిదంగా అమాయక ప్రజలు, విద్యార్ధులు బలైపోతుంటారో అదేవిదంగా కాంగ్రెస్‌లోని ఈ కాళ్ళు లాగుడు సంస్కృతికి రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బలైపోతాయేమో? 


Related Post