తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) సొరంగం పనులు త్వరలోనే మళ్ళీ మొదలవబోతున్నాయని తెలియజేస్తూ దాని కోసం తన తాపత్రయం, ప్రయత్నాలను వివరిస్తూ ఓ వ్యాసం వ్రాయగా అది ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది.
ఆ పేపర్ క్లిప్పింగ్ జత చేస్తూ ఆయన ట్విట్టర్‌లో “ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణానికి అవసరమైన పరికరాలను సమకూర్చే నిమిత్తం.. అమెరికాకు చెందిన రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్‌తో సమావేశానంతరం.. నా నల్గొండ ప్రజలకు నా ప్రయత్నాన్ని వివరిస్తూ రాసిన వ్యాసం ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఎడిటోరియల్ పేజీలో ప్రచురితం అయ్యింది,” అని ప్రజలకు తెలియజేశారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నిర్మాణం పూర్తయితే ఆ సొరంగ మార్గం ద్వారా జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు, ఉదయ సముద్రం ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని అప్పుడు నల్గొండ జిల్లా కూడా కోనసీమల పచ్చగా కళకళలాడుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యాసంలో పేర్కొన్నారు.