రేవంత్‌ విదేశీ పర్యటనపై అక్కసు దేనికి?

August 11, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి బృందం పది రోజులు అమెరికా పర్యటన ముగించుకొని నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంది. అక్కడ శాంసంగ్, ఎల్జీ, హ్యుండాయ్ తదితర దక్షిణ కొరియా కంపెనీల ప్రతినిధులతో భేటీ తదితర  భేటీ అయ్యి రాష్ట్రంలో అవి పరిశ్రమలు ఏర్పాటుచేయాలని కోరబోతున్నారు. 

అయితే రేవంత్‌ రెడ్డి బృందం అమెరికా పర్యటనకు బయలుదేరినప్పటి నుంచే బిఆర్ఎస్ పార్టీ పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రేవంత్‌ రెడ్డి విదేశాలలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు.

కేటీఆర్‌లాగే రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు సంతోషించాల్సిన బిఆర్ఎస్ పార్టీ, పెట్టుబడులు, పరిశ్రమలు అన్నీ బోగస్ అంటూ రేవంత్‌ రెడ్డి సోదరుడి కంపెనీకి సంబందించిన ఫోటోలు, ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అందుకు కేటీఆర్‌ తమ పార్టీ నేత కృశాంక్‌ని అభినందించారు కూడా. తెలంగాణ అభివృద్ధికి ఎవరు కృషి చేసినా సంతోషిస్తానని చెప్పిన కేటీఆర్‌ దీనిని ఏవిదంగా సమర్ధించుకుంటారు? 

తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నవారు బేషరతుగా క్షమాపణలు చెప్పుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్‌ హెచ్చరించారు. మరి రేవంత్‌ రెడ్డి విదేశీ పర్యటన విషయంలో ఆయన చేస్తున్నదేమిటి?


Related Post