బిఆర్ఎస్, బీజేపీలకు ఆమె సలహాలు అవసరమా?

August 07, 2024


img

సినీ పరిశ్రమలో విజయ శాంతి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోగలిగారు. కానీ రాజకీయాలలో ఎన్నిసార్లు పార్టీలు మారినా రాణించలేకపోతున్నారు. ఆమె ఎప్పుడు ఏ పార్టీలోకి మారుతారో ఎవరికీ తెలియదు. కనుక ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉన్నారో గూగుల్ చేసి తెలుసుకోవలసిందే. రాజకీయాలలో రాణించలేకపోయిన ఆమె బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు సలహాలు ఇస్తుండటం చాలా విచిత్రంగా ఉంటుంది. 

తాజాగా ఆమె బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఉద్దేశ్యించి ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేషారు. ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే....       

"పార్టీ వదిలి వెల్లిపోతున్న ఎమ్మెల్యేలను ఆపుకోనీకి కొట్లాడితే బీఆర్ఎస్ బతకజాలదు. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు ప్రారంభం అయ్యిందో గుర్తు తెచ్చుకుని ఆ చరిత వైపు తిరిగి ఆలోచిస్తే ఈ బతిమాలే కార్యక్రమం బహుశా ఉండదు...

ఐతే పదవులల్ల కేసీఆర్ గారితో కలిసి వచ్చిన రాజకీయ నాయకులు ఒక్కొక్కలు ఇయ్యాల ఏవో పరిస్థితులు చూపి బయటకు పోతున్నది వాస్తవం.

ఏది ఏమైనా... బీజేపీ తాము అనుకున్న ఎంపీ స్థానాలు దక్కినాయి అన్న ధోరణి లేదా తమకు చాలినంత ఎమ్మెల్యేలు లేరన్న ఆలోచన వంటి, ఏదైనా కారణాల వల్ల ప్రతిపక్ష  బాధ్యతని ఆచరణాత్మకంగా వ్వవహరించని స్థితి తెలంగాణ ల ఉన్నట్లు కొంత మీడియా ప్రచారం నడుస్తున్న దృష్ట్యా...

తమ సమస్యలపై నియతితో ప్రయత్నిస్తే ప్రజలు ఎన్నడైనా తప్పక విశ్వసిస్తరు... అన్నది దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ చూపుతున్న  విధానం, ప్రామాణికం అన్న  జన బాహుళ్య అభిప్రాయం బీఆర్ఎస్ కు కూడా తెలియజేస్తూ...
జై తెలంగాణ
హర హర మహాదేవ్
విజయశాంతి

Related Post