400 సీట్లు కాదు కానీ... కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వమే!

June 04, 2024


img

ఇప్పటి వరకు వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం మోడీ, అమిత్ షాల నేతృత్వంలో ఎన్డీయే కూటమి 291 సీట్లు గెలుచుకొని మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టమైంది.

ఈసారి ఎన్నికలలో 370-400 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ నేతలు గట్టిగా ప్రచారం చేసుకోవడమే పెద్ద పొరపాటుగా రుజువయ్యింది. 

బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌, మిత్రపక్షాలు చేసిన ప్రచారంతో బీజేపీకి చాలా నష్టం జరిగిన్నట్లే కనిపిస్తోంది. లేకుంటే మరో 30-40 ఎంపీ సీట్లు అయినా అదనంగా వచ్చి ఉండేవేమో? 

ఏది ఏమైనప్పటికీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. కానీ గతం కంటే కాస్త తక్కువ సీట్లు వస్తుండటం, ఆ మేరకు కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు లాభపడి సుమారు 194 సీట్లు గెలుచుకోబోతుండటం బీజేపీ జీర్ణించుకోవడం చాలా కష్టమే. 

ఈసారి అన్నికలలో ఏపీలో టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకొని పోటీ చేయడం వలన ఎన్డీయే ఖాతాలో 22 సీట్లు కలిశాయి. అలాగే తెలంగాణలో బిఆర్ఎస్ నేతలను ఆకర్షించి టికెట్స్ ఇచ్చి పోటీ చేయించడం వలన మరో 8 సీట్లు లభిస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాలలో ఈ సీట్లు కలవకపోతే బీజేపీకి ఇప్పుడు లభిస్తున్నవాటిలో ఏకంగా 30 సీట్లు తగ్గిపోయి ఉండేవి. కనుక ఈసారి బీజేపీ కొంత అదృష్టంతోనే ఈ ఎన్నికల గండం గట్టెక్కబోతున్నట్లు భావించవచ్చు.


Related Post