జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకహోదా అవసరం లేదు: సుప్రీంకోర్టు

December 11, 2023


img

దశాబ్ధాలుగా జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఉంది. మోడీ ప్రభుత్వం దాని కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్గ విచారణ జరిపిన తర్వాత నేడు తుది తీర్పు వెలువరించింది. 

ఆర్టికల్ 370 రద్దుని సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టిగా సమర్ధించింది. ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో విలీనం అయినప్పుడు, ఆ తర్వాత ఏనాడూ సార్వభౌమాధికారం కలిగిలేదు. భారత్‌లో అంతర్భాగంగా కేంద్ర ప్రభుత్వానికి లోబడే ప్రత్యేక హోదా అనుభవిస్తోంది. జమ్ము కాశ్మీర్‌ కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతోనే ప్రత్యేక హోదా కల్పించగా, దానిని వేర్పాటువాదులు తమకు అనుకూలంగా మలుచుకొని యుద్ధవాతావరణం సృష్టించి దానిని దుర్వినియోగపరిచారు.

గతంలో ఆర్టికల్ 370పై మూడు తీర్పులు ఉన్నాయి. వాటిని సవాలు చేయలేదని ఈ సందర్భంగా పిటిషనర్లకు గుర్తు చేస్తున్నాము. దేశ ప్రయోజనాల నిమిత్తం జమ్ము కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కనుక ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని అర్దమవుతూనే ఉంది. 


Related Post