తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఖరారు

December 05, 2023


img

రెండు రోజులపాటు సుదీర్గ మంతనాల తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డినే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌ రెడ్డిల సమక్షంలోనే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఖరారు చేసిన్నట్లు ప్రకటించారు.

ఈనెల 7వ తేదీన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోబోతున్నారనే విషయం తర్వాత తెలియజేస్తామని వేణుగోపాల్ చెప్పారు. సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల అభిప్రాయాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వాటిపై క్షుణ్ణంగా చర్చించిన తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొందని వేణుగోపాల్ తెలిపారు.

ఈ ప్రకటన చేసిన వెంటనే రేవంత్‌ రెడ్డికి పిలుపు రావడంతో వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. బహుశః ఆయనను ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు పార్టీలో సీనియర్ల షరతులు లేదా మంత్రివర్గం కూర్పుపై అధిష్టానం రేవంత్‌ రెడ్డికి నిర్ధిష్టమైన సూచనలు చేసేందుకే ఢిల్లీకి పిలిపించి ఉండవచ్చు. 


Related Post