తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే దాదాపు 16 మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. వాటిలో అత్యధికం కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నాయి. కొన్ని మాత్రం బిఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, మరికొన్ని రెండు పార్టీలకు సరిసమానంగా సీట్లు రావచ్చని తమ అంచనాలను పేర్కొన్నాయి.
చిట్టచివరిగా ప్రముఖ జాతీయ పత్రిక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియాతో కలిసి చేసిన సర్వే నివేదికను ప్రకటించింది. అవి కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నాయి.