బిఆర్ఎస్ అభ్యర్ధులపై కాంగ్రెస్ శ్రేణులు భౌతిక దాడులు చేస్తుండటం ఆ పార్టీ నేతలలో అభద్రతాభావానికి అద్దం పడుతోందని చెప్పక తప్పదు. ఇటీవల మెదక్ బిఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు యశోదా ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కూడా చేయవలసి వచ్చింది.
శనివారం అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్ధి వంశీకృష్ణ అనుచరులు బిఆర్ఎస్ అభ్యర్ధి గువ్వల బాలరాజుపై దాడి చేశారు. ఆ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కారులో డబ్బు తరలిస్తున్నారనే అనుమానంతో తన అనుచరులు అడ్డుకోబోతే ఆయన కారు ఆపకపోవడం వారు దాడి చేశారని వంశీకృష్ణ సమర్ధించుకొన్నారు.
అయితే ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ అభ్యర్ధులపై కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న ఈ భౌతికదాడులు కాంగ్రెస్ పట్ల ప్రజలలో వ్యతిరేకిత, దాడికి గురైన అభ్యర్ధుల పట్ల సానుభూతి కలిగిస్తుందని గ్రహించన్నట్లు లేదు. ఈ భౌతికదాడుల వలన చివరికి కాంగ్రెస్ పార్టీయే నష్టపోయే అవకాశం ఉంటుంది. పోలీస్ కేసులలో చిక్కుకొంటే అది మరో సమస్య అవుతుంది కూడా. ఎన్నికలలో గెలిచినా అనర్హత వేటు వేసేందుకు ఇదీ ఓ కారణం కావచ్చు.