తెలంగాణలో ఎవరి సర్వేలు వారివే... అసలు సర్వే ఏదో?

November 07, 2023


img

తెలంగాలో ఇంతకాలం బిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం నిలిచిన బీజేపీ హటాత్తుగా మూడో స్థానంలో జారుకోగా, కాంగ్రెస్‌ పార్టీ పుంజుకొని రెండో స్థానంలోకి వచ్చి నిలిచింది. దీంతో ఈసారి శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మద్యనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని స్పష్టమైంది.

ఇంతవరకు వెలువడిన సర్వే నివేదికలన్నీ కూడా బీజేపీకి కేవలం 5-6 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చి చెప్పేస్తున్నాయి. అయితే బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలలో ఏది గెలుస్తుంది? ఏది అధికారంలోకి వస్తుందనే దానిపై చేస్తున్న సర్వేలు మాత్రం పూర్తి భిన్నంగా జోస్యం చెపుతున్నాయి. 

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తన సోషల్ మీడియాలో “తెలంగాణలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతోంది?” అని పోలింగ్ నిర్వహించగా దానిలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షమంది పాల్గొన్నారు. దాని ప్రకారం లక్ష మందిలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 60% మంది, బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని 22%, బీజేపీ గెలుస్తుందని 14%, ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చని 4% మంది అభిప్రాయపడ్డారు.  


Related Post