కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబు పేల్చేశారుగా!

November 06, 2023


img

కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈసారి ఎన్నికలలో పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కంటున్నారు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌ పుంజుకోవడంతో ఆయన కల నెరవేర్చుకొనే అవకాశం కూడా కనిపిస్తోంది. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మరింత కృషి చేస్తారనుకోవడం సహజం. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో అపనమ్మకం ఏర్పడేలా మాట్లాడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ప్రముఖ తెలుగు న్యూస్ చానాల్ టీవీ9 అధ్వర్యంలో ఆయన ఓ ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 59 స్థానాలు అంత కంటే ఎక్కువ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుంది కనుక అందరూ పార్టీలోనే ఉంటారు. కానీ 59 కంటే ఒక్క సీటు తగ్గినా కాంగ్రెస్ పార్టీలో నుంచి చాలా మంది వెళ్లిపోవడం ఖాయం,” అంటూ ని కుండబద్దలు కొట్టారు.  

కాంగ్రెస్ పార్టీ సిఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేలను సరఫరా చేసే ఏటిఏం వంటిదని, కాంగ్రెస్‌లో చాలా మంది అభ్యర్ధులకు కేసీఆరే ఎన్నికల ఖర్చులు భరిస్తున్నారని, ఎన్నికల తర్వాత కేసీఆర్‌ చిటిక వేయగానే వారందరూ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారని బండి సంజయ్‌ వాదిస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అదే చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న ఆయన వంటి ఓ సీనియర్ నాయకుడు ఈవిదంగా మాట్లాడుతుంటే ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్ముతారు?


Related Post