మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో మజ్లీస్ పార్టీ సమావేశంలో నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, "రాష్ట్రంలో బిఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలు ఎన్నికలలో పోటీ పడుతున్నాయి. మనం నాలుగో బ్యాట్స్ మ్యాన్‌గా బరిలో దిగుతున్నాము. ఆ మూడు పార్టీలు ఎంత ఆడినా పవర్ ప్లే ఆడేది మాత్రం మనమే. పవర్ ప్లే అంటే తెలుసు కదా?
కనుక కేసీఆర్ మామని మళ్ళీ గెలిపించుకొందాము. మన పవర్ నిలుపుకొందాము. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటికీ బీజేపీ భావజాలం బలంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీలు రెండూ అవిభక్త కవలలు వంటివి. పైకి అవి విడిపోయి కొట్లాడుకొంటున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, రెండు పార్టీలు పరస్పరం సహకరించుకొంటూనే ఉంటాయి. కనుక వాటిలో దేనికి ఓట్లు వేసినా రెండో దానికి కూడా వేసిన్నట్లే అవుతుంది.
కనుక మళ్ళీ బిఆర్ఎస్ పార్టీనే గెలిపించుకొందాము. ప్రాంతీయ పార్టీలైతేనే రాష్ట్రాలను అభివృద్ధి చేయగలవని కేసీఆర్ నిరూపించి చూపారు కదా?కనుక కేసీఆర్ మామని మళ్ళీ గెలిపించుకొందాము. బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను. మీరు కూడా కృషి చేయాలి, “ అని అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు.