తెలంగాణలో డ్రోన్ వాహనాల తయారీకి ఒప్పందం

January 23, 2025
img

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విమానాలు, హెలికాఫ్టర్ల విడిభాగాలు, డ్రోన్‌లు, డ్రోన్ టాక్సీలు తయారుచేసే పరిశ్రమలున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జెఎస్‌డబ్ల్యూ యూఏవీ సంస్థ ఈ రంగంలోనే రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. 

మానవ రహిత విమానాలు అంటే డ్రోన్, డ్రోన్ టాక్సీలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు దావోస్‌ సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఆ రంగంలో మంచి అర్హతలు, నైపుణ్యం ఉన్న 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇది ఉత్పత్తి ప్రారంభించి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తే మరికొన్ని వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

ఇప్పటికే హైదరాబాద్‌లో బ్లూజ్‌ సంస్థ డ్రోన్ టాక్సీలు సిద్దం చేసి ప్రయోగాత్మకంగా పరీక్షలు కూడా జరిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు, లైసెన్స్ కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. ఇప్పుడు అమెరికాకు చెందిన జెఎస్‌డబ్ల్యూ యూఏవీ సంస్థ కూడా వస్తోంది. కనుక రాబోయే రెండు సంవత్సరాలలోనే హైదరాబాద్‌తో సహా తెలంగాణ జిల్లాలలో డ్రోన్ టాక్సీలు గాలిలో ఎగురుతూ కనిపించే అవకాశం ఉంది.

Related Post