సూపర్ హీరోగా.. రోషన్ మేకా సినిమా షురూ!

November 12, 2026


img

సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించనున్న కొత్త సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. 

సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

దాదాపు ఏడాదిన్నరగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్లు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెలిపారు. భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలు, అత్యాధునిక సాంకేతికత, విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి రేఖా పాండే హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వినయ్ రాయ్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, సంగీతం: గౌర హరి, సినిమాటోగ్రఫీ: పి.జి. విందా, ప్రొడక్షన్ డిజైనింగ్: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగ్రోటే, ఫైట్స్: లీ విట్టేకర్, రామకృష్ణ, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్‌ చేస్తున్నారు.

ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.3గా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు కలిసి దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 



Related Post

సినిమా స‌మీక్ష