బెల్లంకొండ శ్రీనివాస్, సంయుక్త జంటగా నటిస్తున్న ‘హైందవ’ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. గురువారం సాయంత్రం 5.04 గంటలకు ఈ సినిమా నుంచి తొలి మెలోడీ సాంగ్ విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ సముద్రం ఒడ్డున హీరో, హీరోయిన్ల పోస్టర్ ఒకటి విడుదల చేశారు.
లుదీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో జేడీ చక్రవర్తి, మహేష్ మంజేకర్, సౌరభ్ సచ్ దేవా, శివాజీ రాజా, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: లుదీర్ బైరెడ్డి, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: శివేంద్ర, ఆర్ట్: శ్రీనాగేంద్ర, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.
మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న హైందవ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.