నేడు ప్రముఖ నటి రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ హీరోగా చేస్తున్న ‘డేవిడ్ రెడ్డి’ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె కమలారెడ్డిగా నటిస్తున్నట్లు పరిచయం చేశారు.
చేతిలో కత్తి పట్టుకొని సింహాసనంలో కూర్చొని ఉండగా వెనుక గుర్రం, ఆమె కాలి కింద, చుట్టూ శవాల గుట్టలు పడి ఉన్నట్లు చూపారు. ఆమె ఒక్కరే వారందరితో పోరాడి మట్టుబెట్టినట్లు చూపారు. ఆమె చాలా శక్తివంతురాలైన నాయకురాలి పాత్ర చేస్తున్నట్లు ఈ ఒక్క పోస్టర్‌తో స్పష్టం చేశారు.
హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో సిద్ధమవుతున్న ‘డేవిడ్ రెడ్డి’ ఓ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్. దీనిలో ఉక్రెయిన్ అందాల భామ మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ‘క్లారా విట్మోర్’గా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె పాత్రని పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆర్.పార్దిబన్, కాంచన ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, కోరియోగ్రఫీ: సుప్రీం సుందర్, యాక్షన్: సుప్రీం సుందర్, వింగ్ చున్ అంజి, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై మోతుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.