రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన హిందీ సినిమా ‘హనుమాన్ అంశ్’ ఉత్తరాది రాష్ట్రాలలో సూపర్ హిట్ అయ్యింది. ఏకంగా రూ.150 కోట్లు వసూళ్ళు సాధించింది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పణలో ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ నెల 18న విడుదల చేస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున వినాయకచవితి సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు ‘హనుమాన్ అంశ్’ టీజర్ విడుదల చేస్తున్నారు.
ఇది 1900-73 మద్య కాలంలో జీవించిన హనుమాన్ భక్తుడు, ప్రముఖ ఆద్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితగాథ ఆధారం తీసిన సినిమా. దీనిలో నీమ్ కరోలీ బాబాగా శోభిత్ శ్రీవాత్సవ నటించగా, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. శోభినవ్ సత్యా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు ఇతర పాత్రలలో నటించారు.
ఉత్తరాది ప్రజలను భక్తిపారవశ్యంలో ముంచెత్తిన ఈ సినిమాకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: విశాల్ చతుర్వేది.
సినిమాటోగ్రఫీ: విశాల్ బావా, ఎడిటింగ్: శంఖ్ రాజాధ్యక్ష, పాటలు: సాధు తివారీ, రిషి పాఠక్, శ్రేయస్ ధర్మాధికారి, శంతను సుదామే, సంగీతం: ధీరేంద్ర ముల్కల్వార్, సునీల్ లోధి, ధీరేంద్ర ముల్కల్వార్, విశాల్ చతుర్వేది చేశారు,
స్వంభు మీడియా నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో, హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రాగిణి ఎస్., నమ్రత జి. సింగ్, అనుప్రియా ఎ.నగర్, విశాల్ చతుర్వేది కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగులో ఈ నెల 18న విడుదల కాబోతోంది.