అక్టోబర్ 2నే ఆదర్శ కుటుంబం.. ఆలస్యం లేదట!

September 06, 2026


img

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో సిద్దమవుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47’ అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ మద్యలో సంగీత దర్శకుడు, తర్వాత సినిమాటోగ్రాఫర్ మారడంతో షూటింగ్‌ ఆలస్యమయ్యిందని కనుక సినిమా వాయిదా పడవచ్చని ఊహాగానాలు వినిపించాయి. వాటిపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ, ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2నే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనిలో ఎటువంటి మార్పు లేదు. ఇక నుంచి రాబోయే నెలరోజులు వరుసగా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ సందడి మొదలవుతుంది. వచ్చే వారం టీజర్‌ విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత ఫస్ట్ సింగిల్, ఈ నెలాఖరులోగా ట్రైలర్‌ విడుదల చేస్తాము.     

న విడుదల కాబోతున్న   

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. ఇంకా రావు రమేష్,  బ్రహ్మాజీ, నారా రోహిత్, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్,  ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేస్తున్నారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష