ఒక తానులో ముక్కలే అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. కోలీవుడ్ నటుడు విశాల్ మాటలు విన్నప్పుడు అదే అనిపిస్తుంది.
విశాల్ నటించిన ‘మకుటం’ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ, “సిఎం విజయ్ లయోలా కాలేజీలో నా సీనియర్ కాగా మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ నా బ్యాచ్‌మేట్! ఒకే కాలేజీలో చదువుకున్నప్పటికీ ఉదయనిధి స్టాలిన్ని విజయ్ అరెస్ట్ చేయించాల్సి వచ్చింది.
ఎందుకంటే, ఇప్పుడు ఇద్దరూ రాజకీయాలలో ఉన్నారు. రాజకీయాలలో ఉన్నవారు సభలు, సమావేశాలలో ముందుగా వ్రాసుకొచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కానీ మద్యలో మాట జారితే ఇలాంటి సమస్యలు తప్పవు.
నేను ఉదయనిధి ప్రసంగం విన్నాను. దానిలో అయన త్రిషని ఉద్దేశ్యించి వ్యంగ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. భావ ప్రకటన స్వేచ్చ ఉంది కదా అని హద్దులు దాటకూడదు. ముఖ్యంగా ఇలాంటి సున్నితమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది కాదు,” అని విశాల్ అన్నారు.
రాజకీయాలలో ఇలాంటివన్నీ మామూలే కనుక ఇలాంటి ఆటుపోట్లను తట్టుకుంటూనే ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇదే అసలైన రాజకీయం,” అని అన్నారు. విశాల్ కూడా రాజకీయాలలో ప్రవేశించాలనుకుంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. బహుశః టీవీకే పార్టీలో చేరి విజయ్ కి బ్యాచ్ మేట్ అవుతారేమో?