రామాయణ తెలుగు ట్రైలర్‌

August 06, 2026


img

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటించిన ‘రామాయణ’ మొదటి భాగం ట్రైలర్‌ నేడు విడుదలైంది.

గత నెల 24న ట్రైలర్‌ విడుదల చేయాలనుకున్నప్పటికీ, హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ‘సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్మెంట్’ ఈ సినిమాలో భాగస్వామిగా చేరడంతో, ఇంగ్లీషులో కూడా ట్రైలర్‌ విడుదల చేయాలనే ఆలోచనతో చివరి నిమిషంలో వాయిదా వేశారు.

నేడు ఇంగ్లీషుతో సహా వివిధ భారతీయ భాషలలో ఒకేసారి రామాయణ మొదటి భాగం ట్రైలర్‌ విడుదల చేశారు. . 

రామాయణ లో హనుమంతుడిగా బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌, లక్ష్మణుడుగా రవీ దుబే, అరుణ్ గోవిల్ దశరథుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, రావణుడుగా కన్నడ నటుడు యష్‌, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. 

ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అలాగే 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్‌జీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పనిచేస్తోంది. దాని పనితనం ట్రైలర్‌లో అడుగడుగునా కనిపించింది. 

ఈ ఏడాది దీపావళి (నవంబర్‌ 8)న రామాయణ మొదటి భాగం, వచ్చే దీపావళికి రెండో భాగం విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష