క, కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీలతో వరుసపెట్టి హిట్లు కొడుతున్న కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈసారి సూపర్ హిట్ మూవీ 'కాంతార'కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీకాంత్ పుష్పాలని ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. వీరి సినిమాకి ‘ఇంద్రప్రస్థ’ అనే పేరు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
'కాంతార' వంటి సూపర్ హిట్ సినిమా టీమ్‌లో పని చేసిన శ్రీకాంత్ పుష్పాలతో కిరణ్ అబ్బవరం చేయబోతున్న ఈ కొత్త సినిమా కథ, కాన్సెప్ట్ ఏమిటనే ఆసక్తి అందరిలో నెలకొంది. త్వరలోనే అధికారికంగా సినిమా పేరు, నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.