అప్పుడే ఓటీటీలోకి లెనిన్...

August 01, 2026


img

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేసిన ‘లెనిన్’ జూలై 10న థియేటర్లలో విడుదలైంది. చాలా ప్రయత్నాల తర్వాత అఖిల్ సినిమా సూపర్ హిట్ అవడంతో అక్కినేని కుటుంబం సంతోషంతో పొంగిపోయింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించిన లెనిన్ వంద కోట్లు కలెక్షన్స్‌ కూడా సాధించింది. ఇప్పుడీ సినిమా జీ 5 ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రసారం కాబోతోందని జీ5 ప్రకటించింది. 

క్లుప్తంగా లెనిన్ కథ: లెనిన్ ఎవరూ లేని ఓ అనాధ. ఓ గ్రామానికి వచ్చినప్పుడు ఓ పెద్దింటి ఇల్లాలు (ఈశ్వరీరావు) చేరదీస్తుంది. ఆమె కొడుకు వసంత (ప్రమోద్ మంజు) లెనిన్ ప్రాణ స్నేహితులవుతారు. అదే ఊళ్ళో భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో లెనిన్ ప్రేమలో పడతాడు. ఊళ్ళో జరిగే ఉత్సవాలలో ఓ సంఘటన జరుగుతుంది. అప్పుడు లెనిన్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ.   


Related Post

సినిమా స‌మీక్ష