హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి 'మెడ ముట్టు కుంటే తొడ కొట్టినట్లే..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్, సంగీతం, లిరిక్స్ అన్నీ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి.
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ నటిస్తున్న పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రానా, పార్ధిబన్, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర, అవినాష్, గిరి, నాగ మహేష్ బాబు, నర్రా శ్రీను, టెంపర్ వంశీ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, రమేష్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, నబకంత, పృధ్వీ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి నిర్మిస్తున్న‘ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.