ఇట్లు మీ ఎదవ... అంటే ఏదో అనుకునేరు... అది కూడా ఓ సినిమా పేరే! దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. బాగా చదువుకొని, మంచి ఉద్యోగం, సంపాదన ఉన్న కుర్రాళ్ళకు తప్ప అల్లరి చిల్లరగా తిరిగే ఎదవలకు నచ్చిన అమ్మాయిని ప్రేమించే హక్కు ఉండదా? అంటూ వ్రాసున్న ఆ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
త్రినాధ్ కొటారీ స్వీయ దర్శకత్వంలో హీరోగా చేసిన ఈ సినిమాని తెలుగమ్మాయి సాహితి అవాంచ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్ళారి శంకర్ ఈ సినిమా నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: ఆర్‌పీ పట్నాయక్; కెమెరా: జగదీష్ చీకటి; ఎడిటింగ్: ఉద్ధవ్ ఎస్‌బీ చేశారు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.