ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సిద్దమవుతున్న కల్కి ఎడి 2898 సినిమా గురించి ఓ ఆసక్తి కరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా జనవరి 12న విడుదలవుతుందని అనుకుంటే జూన్ 9కి వాయిదా పడింది.
ఇప్పుడు ఈ సినిమా జూన్ 27కి వాయిదా పడబోతున్నట్లు తాజా సమాచారం. ‘బుక్ మై షో’ ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఏజన్సీ తమ వెబ్సైట్లో ఈ సినిమా జూన్ 27న విడుదల కాబోతున్నట్లు చూపిస్తోంది.
ఏపీ తెలంగాణలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతుండటం, సినిమా గ్రాఫిక్ పనులు ఆలస్యం అవుతుండటం వలన సినిమాను వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ సమయానికి వేసవి సెలవులు పూర్తయ్యి స్కూళ్ళు, కాలేజీలు తెరుచుకుంటాయి. ఇదీగాక అదే నెలలో కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ సినిమా ఇండియన్-2 చాలా భారీ అంచనాల మద్య ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
కనుక జూన్ 27న కల్కిని విడుదల చేసుకున్నా సినిమా ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండకపోతే చాలా నష్టం జరుగుతుంది.
శనివారం సాయంత్రం కల్కి ఎడి2898 సినిమా రిలీజ్ డేట్, రిలీజ్ పోస్టర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కనుక మరికొన్ని గంటలలో కల్కి ఎప్పుడొస్తాడనేది తేలిపోవచ్చు.