ఎన్టీఆర్ రికార్డుని కొల్లగొట్టిన చరణ్..!

December 11, 2017


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ సినిమాలో తన నట విశ్వరూపానికి అందరు ఫిదా అయ్యారు. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కాని వారు కూడా జై లవ కుశ చూసి జయహో ఎన్.టి.ఆర్ అనేశారు. ఇక ఆ సినిమా రికార్డులు గురించి తెలిసిందే. ముఖ్యంగా ఫస్ట్ లుక్ పోస్టర్ జై లవ కుశ ట్వీట్స్ రూపంలో అరుదైన రికార్డ్ సాధించింది. 24 గంటల్లో 2 లక్షల 40 వేలకు పైగా ట్వీట్స్ రికార్డ్ సృష్టించింది జై లవ కుశ ఫస్ట్ లుక్ పోస్టర్.

ఇక ఆ రికార్డుని కొల్లగొట్టాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. రీసెంట్ గా రిలీజ్ అయిన రంగస్థలం ఫస్ట్ లుక్ ఏకంగా 24 గంటల్లో 2 లక్షల 91 వేలకు పైగా ట్వీట్స్ సాధించింది. చరణ్ కెరియర్ లో ఇలాంటి రికార్డ్ మొదటిసారి కాగా ఇలాంటి అద్భుతమైన రికార్డులు మరెన్నో ఈ రంగస్థలంతో సాధించడం పక్కా అంటున్నారు మెగా అభిమానులు. 

సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది. పల్లెటూరి ప్రేమకథతో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా చెర్రి కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష