పవన్ జనసేనకు అబ్బాయి ఫుల్ సపోర్ట్..!

December 11, 2017


img

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తన ప్రత్యక్ష మద్ధతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. బాబాయ్ అంటే అమితంగా ఇష్టపడే చరణ్ తను స్థాపించిన జనసేన పార్టీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడట. ఇక ఈ విషయం పట్ల చిరంజీవి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడట. చిరుతో డిస్కస్ చేసిన అనంతరం చరణ్ బాబాయ్ లు నాగ బాబు, పవన్ లతో కూడా చర్చిస్తాడట.

ఇక 2014 పోటీలో దిగే అవకాశం ఉన్నా పదవుల కోసం ఆశించకుండా పార్టీ బలోపేతం చేసేందుకు పవన్ రాజకీయ పార్టీలకు ప్రశ్నలను సంధిస్తున్నాడు. మరి బాబాయ్ పార్టీకి అబ్బాయ్ సపోర్ట్ వస్తే ఇక ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం చేస్తుండగా ఆ సినిమాతో పాటుగా సైరా నరసింహారెడ్డి నిర్మాణ భాధ్యతలను చూసుకుంటున్నాడు.  

ఇక 2018లో బోయపాటి శ్రీను సినిమా షురూ చేస్తున్న చరణ్ ఆ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమాలో రాం చరణ్ తో పాటుగా తారక్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే.



Related Post

సినిమా స‌మీక్ష