ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి సినిమా..!

December 11, 2017


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. యంగ్ ఏజ్ లో తారక్ సృష్టించిన ఆ సినిమా టాలీవుడ్ ను షేక్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత తారక్ తో రాజమౌళి సినిమా ఫలితాలు తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ ఇద్దరు కలిసి రాం చరణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే సేం సింహాద్రి లాంటి కథతో తారక్ ను సర్ ప్రైజ్ చేశాడట దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవగా తారక్ సింహాద్రి లాంటి కథను సిద్ధం చేసి వినిపించాడట. ఎన్.టి.ఆర్ యూరప్ ట్రిప్ కు ముంది ఈ కథ విన్నాడట. ట్రిప్ ముగించుకుని వచ్చాక సినిమా గురించి ఆలోచిద్దాం అని చెప్పాడట. బ్రహ్మోత్సవం అంచనాలను అందుకోకున్నా దర్శకుడు చెప్పిన కథ నచ్చి తారక్ అతనితో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.  



Related Post

సినిమా స‌మీక్ష