నాగార్జున పంచ్ అదిరిందిగా..!

December 07, 2017


img

ఏపి ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు విషయంలో నిన్న మొన్నటిదాకా జరిగిన రచ్చ తెలిసిందే. కులానికి ప్రాధాన్యత ఇచ్చే నంది అవార్డులు ఇచ్చారని కామెంట్ చేశారు. అయితే 2014 సంవత్సరానికి మనం కు బదులు లెజెండ్ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డ్ ప్రకటించారు. దీనిపై పరిశ్రమలో కొందరు తమ విమర్శలను తెలిపారు. అయితే నాగార్జున ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అన్నది హాట్ న్యూస్ అయ్యింది. 

అనుకున్నట్టుగానే నంది అవార్డుల మీద స్పందించిన నాగ్ అదిరిపోయే పంచ్ వేసేశాడు. మనం అక్కినేని ఫ్యామిలీకి చాలా ప్రత్యేకమైన సినిమా ఇక ప్రేక్షకుల హృదయాలను ఆ సినిమాకు రాసిచ్చారు. నంది అవార్డుల గురించి పట్టుకోను.. ఆ సినిమా మాకు ఆస్కార్ కన్నా ఎక్కువే అంటూ తన మనసులోని మాట చెప్పేశాడు నాగ్. అఖిల్ నటిస్తున్న హలో సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నాగ్ పై విధంగా స్పందించాడు.Related Post

సినిమా స‌మీక్ష