మహేష్ ఇంకా పెండింగ్ లోనే ఉంచాడట..!

December 07, 2017


img

నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ కలిసి బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారని టాక్ వచ్చింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను రాం చరణ్ తో మూవీకి సిద్ధమవుతుండగా ఆ సినిమా తర్వాత బాలయ్య, మహేష్ మల్టీస్టారర్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య ఓకే చెప్పగా మహేష్ ఇంకా పెండింగ్ లోనే ఉంచాడని తెలుస్తుంది.

మహేష్ ప్రస్తుతం భరత్ అను నేను సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి సినిమా కూడా లైన్ లోనే ఉంచాడు మహేష్. ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి మహేష్ బోయపాటి మల్టీస్టారర్ పై నిర్ణయం చెబుతా అని చెప్పాడట. ప్రస్తుతం అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్న మహేష్ కొరటాల శివ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు.Related Post

సినిమా స‌మీక్ష