అల్లు అర్జున్ డేర్ డెశిషన్..!

December 06, 2017


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బన్ని వాసు, నాగబాబు సహ నిర్మాతలుగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడు సంతోష్ రెడ్డితో సినిమా చేయబోతున్నాడట అల్లు అర్జున్. సంతోష్ చెప్పిన కథ నచ్చడంతో అతనికి ఓకే చెప్పేశాడట బన్ని. కథ కథనాలు తనని సర్ ప్రైజ్ చేయడంతో కొత్త దర్శకుడు అన్న విషయం ఆలోచించకుండానే సినిమా చేస్తున్నాడట.  

స్టార్ హీరో అయ్యుండి కొత్త దర్శకుడితో సినిమా అంటే కచ్చితంగా ఇది అల్లు అర్జున్ తీసుకుంటున్న డేర్ డెశిషన్ అని చెప్పొచ్చు. అసలైతే తెలుగు తమిళ భాషల్లో లింగుసామితో సినిమా చేయాలని అనుకున్నా అది ఇంకా లేట్ అయ్యేట్టు ఉందని తెలుస్తుంది. సంతోష్ రెడ్డి సినిమాతో మరోసారి కొత్త వాళ్లకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలియచేస్తున్నాడు అల్లు అర్జున్. మరి ఈ సినిమాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష